గతకాలంలో "పురుషుడు చెప్పిందే వేదం అతడు అనుసరించేదే శృంగారం"  రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. అలాగే శృంగారంలో పాల్గొనే ఇద్దరు సమాన అనుభూతి సంపూర్ణంగా పొంది సమాప్తమయ్యే ఆటే సంభోగం. అలాంటి చోట ఒక పురుషుడు మాత్రమే పొందే ఆనందం సంపూర్ణ సుఖం సంభోగం ఎలా అవుతుంది.  




మారుతున్న కాలంతో పాటు మారే  సాంకేతిక, తద్వారా అందే విజ్ఞానంతో మానసిక పరిణితి కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది చిన్న వయస్సులో శృంగారం గురించి తెలుసు కుంటున్నారు. అంతర్జాలం అందుబాటు లోకి వచ్చాక స్త్రీ, పురుష లైంగిక వ్యవస్థపై చాలా మంది సరైన శాస్త్రీయ అవగాహన కు వస్తున్నారు. శృంగారానికి సంబంధించి అనేక విషయాలు తెలుసు కుంటున్నారు. 




అయితే శృంగారం సమయంలో స్త్రీ, పురుషులు అనుభవించే సుఖంలో ఉండే బేధాలు వైరుధ్యాలు అవగతం చేసుకుంటున్నారు. పురుషులు అనుభవించినంత తృప్తిని స్త్రీలు పొందలేక పోతున్నారట. మహిళల్లో భావప్రాప్తికి కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది.




పురుషులు భావప్రాప్తి పొందేందుకు “పరిమిత వనరులు” ఉపయోగించు కుంటారు. పడకగది విషయానికి వచ్చే సరికి దాదాపుగా పురుషుడిదే ఆధిపత్యం. ఇది అనాది కాలం నుండి వస్తూ ఉంది. పురుషాధిఖ్య సమాజం దాన్ని కొనసాగిస్తూ ఉంది. పడక సుఖం పొందటంలో పురుషులదే పైచేయిగా ఉంటుంది.

ఆకాశంలో అవకాశాల్లో సగం కోరే మగువలు పడకగదిలో పడక సుఖంలో పైచేయి సాధించాలనుకున్నా కొన్ని కారణాలతో వెనక్కు తగ్గుతారని తెలిసింది. శృంగారం సమయంలో పెత్తనం చూపిస్తే, ఆ తర్వాత పురుషుడు మానసికంగ వేధించే అవకాశాలంటాయన్న కారణంతో మహిళలు తమ కోరికలను అణిచిపెట్టుకొని ఉంటున్నారని తాజా అధ్యయనంలో తెలిసింది.




కొందరు మహిళలు మాత్రం వారు పెరిగిన వాతావరణం, సంస్కృతికి, సాంప్రదాయానికి, ఆచారవ్యవహారాలకు తగిన విధంగా సమాజంలో కుటుంబ పరువు ప్రతిష్ఠల ముసుగులో శృంగారంలో బాగస్వామిలాగా సమాన సంతృప్తి లభించక పోయినా సర్దుకుపోతూ ప్రవర్తిస్తున్నారట.



చతుషష్టి కళలలో ఒకటైన శృంగార కళ మగవానికి మగువకు ఇద్దరికి సమాన సౌఖ్యం అందించే ఒక క్రీడ అని వాత్సాయన మహర్షి 2500 సంవత్సరాల క్రితమే ప్రభోదించారు. అందుకే శృంగారం అనేది ఒక కళాత్మక అనుభవం అని శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి సంభోగ ప్రక్రియలో పురుషుడు తన తృప్తి కోసమే పాకులాడుతున్నాడు. తనతో పాల్గొన్న తన ప్రియ భాగస్వామికి తృప్తి కలిగిందా? లేదా? అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం మరచిపోయాడు పురుషుడు అదీ తన పురుషాధిఖ్యత వలననే.



ప్రస్తుతం మహిళల భావప్రాప్తి అనే అంశాన్నితక్కువ ప్రాధాన్యత కలిగిన అంశంగా మార్చేశారని, అది తన పడకగది బరిలో మగువకు పడకసుఖమనే క్రీడలో సంతృప్తి అందించటం బాగస్వామిగా పురుషుని ప్రధాన కర్తవ్యం. అలాగే మగువ కూడా! అయితే పురుషుడు ఇక్కడ కూడా పురుషాధిఖ్యం ప్రదర్శిస్తూ సౌకర్యంగా ఆ బాగస్వామి తృప్తిని గాలికి వదిలేశాడని తెలిపారు. “సెక్సవల్‌ వెల్‌నెస్‌ బ్రాండ్‌ కే-వై” అధికార ప్రతినిధి, శృంగార శాస్త్ర        

(సెక్స్ సైన్స్) నిపుణురాలు ‘జెన్నీపర్‌ వైడర్‌’



శృంగార సమయంలో మహిళలు ఎలా ఉద్రేకానికి గురి అవుతారన్న విషయాలను ప్రతి పురుషుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని ప్రత్యేక దేహాంగా లపై, మెడపై తాకడం, చేతి మునివేళ్లతో స్పర్శించడం వంటి పనులు చేస్తూ మహిళలను ఉద్రేక పరచాలి. అప్పుడే వారు కొంతైన తృప్తి పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబు తున్నారు.



మహిళలను తృప్తి పరచడానికి ఎలాంటి ఫార్ములాలు లేవని, శరీరానికి, సమయానికి, వాతావరణానికి తగ్గట్లు పురుషుడు వ్యవహరించుకుంటూ తను ప్రకటించే అకదలికల ద్వారా, సాధన ద్వారా, అనుభవం ద్వారా శృంగార క్రీడలో ఆమె పొందే అనుభూతులను అనుసరించటమేనని “మేక్‌ లవ్‌ నాట్‌ పోర్న్‌” (సోషల్ సెక్స్ వీడియో షేరింగ్ ప్లాట్ఫాం) అధిపతి సిండీ గలాప్‌ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: