నోటి దుర్వాసన సమస్య తలెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పొగాకు ఉత్పత్తులను వాడడం, నోటి ఇన్ఫెక్షన్స్ ఇంకా అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, నీటిని తక్కువగా వాడడం, నోరు పొడిబారడం వంటి వివిధ కారణాల వలన ఈ నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.అలాగే శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా  నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి మౌత్ ఫ్రెష్ లను వాడడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే మౌత్ ఫ్రెష్ లను వాడే అవసరం లేకుండా కొన్ని రకాల టిప్స్ వాడడం వల్ల మనం చాలా సులభంగా నోటి దుర్వాసన సమస్యని తగ్గించుకోవచ్చు.నోటి దుర్వాసన సమస్యతో చాలా ఎక్కువగా బాధపడే వారు దంతాలతో పాటు నాలుకను కూడా చాలా శుభ్రం చేసుకోవాలి.


వారు టంగ్ క్లీనర్ ను ఉపయోగించి నాలుకపై ఉండే పాచిని పూర్తిగా తొలగించుకోవాలి. ఇంకా అలాగే భోజనం చేసిన తరువాత ఉప్పు నీటితో నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇంకా అలాగే నోరు పొడిబారకుండా చూసుకోవాలి.అందుకు ఖచ్చితంగా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నోటి దుర్వాసనను తగ్గించడంలో పుదీనా, లవంగాలు, యాలకులు, సోంపు ఇంకా అలాగే తులసి వంటివి చాలా చక్కగా పని చేస్తాయి. వీటిలో ఏదో ఒకటి నోట్లో వేసుకుని ఎక్కువగా నములుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించడంతో పాటు నోటి దుర్వాసన సమస్య ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్స్ వాడినప్పటికి సమస్య తగ్గకపోతే ఖచ్చితంగా వెంటనే వైద్యున్ని సంప్రదించి శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ వాడడం వల్ల మనం చాలా సులభంగా నోటి దుర్వాసన సమస్యని తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: