మన జుట్టుకు మనం తినే ఆహారంతో పాటు, జుట్టుకు రాసే నూనె కూడా పోషణను అందిస్తుంది.అంతే కాక ఆయుర్వేద ఔషదాలు కలిగిన,కొన్ని రకాల ఆయిల్స్ ను మాడుకు బాగా మర్దన చేసుకోవడం వల్ల, జుట్టు రాలడం,చుండ్రు,దురద వంటి జుట్టు సమస్యలుకు ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి ఆయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బ్రింగరాజ్ ఆయిల్..
బ్రింగరాజ్ ఆయిల్ ను మాడుకు అప్లై చేసి, మర్దనా చేసుకోవడం వల్ల అందులోని అందులోనే ఫ్యాటీ ఆసిడ్స్, మినరల్స్ మరియు విటమిన్స్ జుట్టు పోలికల్స్ గట్టిపడి,హెయిర్ రూట్స్ బలంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

గుమ్మడి గింజల నూనె..
గుమ్మడి గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్,' విటమిన్ ఈ'జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న క్యూరబైటిన్ అనే అమైనో యాసిడ్ జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగడానికి దోహదపడుతుంది.

రోజ్మెరీ అయిల్.. 
రోజ్మెరీ అయిల్ తరుచు అప్లై చేసుకోవడం వల్ల, జుట్టుకు రక్తసరఫరా పెంచి, కొత్త జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది.ఇందులోని యాంటి ఆక్సిడెంట్ లు చుండ్రు, దురద,చికాకు వంటివి తగ్గించడమే కాక,తొందరగా జుట్టు నేరవకుండా సహాయపడతాయి.

ఆర్గాన్ ఆయిల్..
ఆర్గాన్ ఆయిల్ లో జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే, యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ పుష్కళంగా లభిస్తాయి.ఈ గుణాల వల్ల జుట్టుకు బాగా పోషణ అంది, జుట్టు రాలడాన్ని తగ్గించి,పొడవుగా, ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయ పడతాయి.

టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్ లో సహజంగానే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. అధిక చుండ్రును కలిగించే,ఫంగస్ తో పోరాడి, దురద, చికాకును, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.మరియు మాడుకు చల్లదనాన్ని అందించి, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెను తరుచూ అప్లై చేయడం వల్ల, ఇందులోని విటమిన్ ఈ మరియు బిటా కెరొటీన్ జుట్టుకు పోషణను అందించి, జుట్టు బలంగా, దృఢంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: