ఇక మనం కొన్ని రకాల పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది.అలాగే పొట్టలో మలినాలనేవి పేరుకుపోకుండా ఉంటాయి. మీ పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది. ఇక పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆ పండ్లు ఏమిటి వాటి గురించి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఆపిల్ పండ్లు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఆపిల్ లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక మంచి ప్రీ బయాటిక్ గా పని చేస్తుంది. మన పొట్టలో ఉండే ప్రయోజకరమైన బ్యాక్టీరియా ద్వారా మాత్రమే ఈ పెక్టిన్ విచ్చిన్నమవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ అంతా చాలా బాగా మెరుగుపడుతుంది.పొట్ట బాగా శుభ్రపడుతుంది. అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల కూడా మన జీర్ణవ్యవస్థ పనితీరు చాలా బాగా మెరుగుపడుతుంది. దీనిలో ఉండే పప్పైన్ అనే పదార్థం జీర్ణవ్యవస్థ సాఫీగా సాగేలా చేయడంలో సహాయపడుతుంది. ఆహరాన్ని తీసుకోవడానికి ముందు బొప్పాయి పండును తినడం వల్ల మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.


అలాగే దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మలినాలు ఇంకా విష పదార్థాలు కూడా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా అదే విధంగా నారింజ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ సాఫీగా సాగేలా చేయడంలో బాగా సహాయపడుతుంది. నారింజ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది.పొట్ట ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే జామకాయలో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక దీనిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన 12 శాతం ఫైబర్ అనేది లభిస్తుంది. జామకాయను తినడం వల్ల ప్రేగుల కదలికలు కూడా పెరుగుతాయి. ఇంకా అలాగే డయేరియా వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.ఇంకా అదే విధంగా స్ట్రాబెరీలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంకా ప్రేగుల కదలికలను క్రమబద్దీకరించడంలో వీటిలో ఉండే ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపరచడంతో పాటు పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: