ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే.. చిన్నవాళ్లకు సలహాలు ఇస్తుంటారు. అలా చేయండి.. ఇలా చేయవద్దు అని చెబుతుంటారు. కానీ వారి మాటలు ఈ తరానికి చిరాకు తెప్పిస్తాయి. మాకు తెలుసులే.. అనో.. ఇదే మీ కాలం కాదు అనో చెబుతూ వారి మనస్సు నొప్పిస్తుంటారు. కానీ వారి మాటల్లోని అంతరార్థం గ్రహించరు.

 

 

ఉదాహరణకు చిన్న పిల్లలకి దిష్టి తీయమని చెబుతారు. ఇంకా ఈ కాలంలోనూ దిష్టి గిష్టీ ఏమిటని ఇప్పటి తరం విసుక్కుంటుంది. కానీ.. చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దదిష్టిని విభిన్నపద్ధతులలో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు.

 

 

పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా నీతితో దిష్టి తీస్తుంటారు. బయట జనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

 

వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురిఅవుతారు. వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది. అదీ అసలు సంగతి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: