ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. అలా చాలామంది వాకింగ్ కూడా చేస్తూ ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కొంత సమయాన్ని కేటాయించి మరి సింపుల్ వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా వాకింగ్ చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాకింగ్లో విభిన్నమైన మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. చెప్పులు లేకుండా వాకింగ్ చేయడం మరింత మంచిది.. అలాగే నేల మీద కంటే గడ్డిమీద వాకింగ్ చేయడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయట.

చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడిచినట్లు అయితే మనసుకు శరీరానికి చాలా ప్రశాంతత దొరుకుతుందట. ముఖ్యంగా భూమి నుండి వచ్చేటువంటి ఎలక్ట్రాన్లు మన శరీరానికి బదిలీ అవ్వడానికి ఈ వాకింగ్ చాలా సహాయపడుతుంది. అలాగే నిద్ర కూడా సుఖంగా పడుతుందట.


పచ్చగడ్డి మీద నడుస్తూ వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ఒత్తిడి అయినా సరే దరికి చేరనివ్వదు.. బదులుగా  శరీరం మీద భారం కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. స్ట్రెస్  కనిపించదు.

మనిషి శరీరంలో ఉండే ఎన్నో నరాలు పాదాల దగ్గరనే చివరిగా ముగుస్తాయి.దీంతో శరీరంలో ఉండే నరాలకు చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే నరాలు సైతం యాక్టివ్గా మారుతాయట. ఇవి శరీరం అంత రక్తప్రసరణ ఆక్సిజన్ సప్లై పైన చాలా ఉపయోగపడతాయి.



ఈ మధ్యకాలంలో చాలా మంది స్టైల్ గా ఇంట్లో ఉన్నా కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉన్నారు.. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు.


పచ్చి గడ్డిమీద నడుస్తూ వెళ్లడం వల్ల శరీరానికి కాస్త శక్తి కూడా లభించేలా ఉండడమే కాకుండా.. భూ గురుత్వాకర్షణ బలం చేకూరుస్తుందట.


మట్టిలో ఉండే సూక్ష్మజీవులు శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా సహాయపడతాయి. అలాగే పచ్చ గడ్డి మీద నడవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా బలమవుతుంది దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడవు.

మరింత సమాచారం తెలుసుకోండి: