
ఎక్కువగా చాలామంది ఇళ్లల్లో ఉపయోగించేది కర్పూరం. హిందువులు, దేవాలయాలలో వీటిని పూజ హారతిగా ఉపయోగిస్తారు. చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే ఈ కర్పూరం మన శరీరానికి ఒక ఔషధంలా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాలలో కర్పూరం నీటిని తాగుతూ ఉంటారు దీనివల్ల నీటిలో ఉండే చెడు బ్యాక్టీరియా మరణిస్తుందని కలుషితమైన పదార్థాలను స్వచ్ఛమైన నీటిగా మారుస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ కర్పూరాన్ని మనం నిద్రించే చోట పెట్టుకున్నట్లు అయితే దోమలు రాకుండా చూసుకుంటుంది. అప్పుడప్పుడు మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల కూడా స్వచ్ఛమైన వాతావరణాన్ని ఉంచేలా చేస్తుంది.
అయితే ఏదైనా తేలు లేదా పాము పుట్టిన చోట. ఆపిల్ రసంలో కొంత పచ్చ కర్పూరాన్ని వేసి బాగా కరగబెట్టి అరగంటకు ఒకసారి ఆ కుట్టిన వ్యక్తికి తాగిస్తే శరీరంలో ఉండే విషం చెమట రూపంలో నుంచి బయటికి వస్తుంది.
అప్పుడప్పుడు కర్పూరం వాసన పీల్చడం వల్ల కూడా మైండ్ కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు, అలసట వంటివి ఏర్పడవు.
నరాల సమస్యలు, వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు గోరువెచ్చని నీటిలోకి కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల తగిన ఫలితం లభిస్తుంది.
ముఖ్యంగా పిల్లలకు బొబ్బలు, గజ్జి వంటి సోకినప్పుడు కర్పూరం పొడిని ఉపయోగిస్తే చాలా మంచిది.
కర్పూరం జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.