టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ గా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపిస్తోంది. సినిమాలో ఎవరూ స్టార్ కాస్టింగ్ లేకపోయినా కూడా రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ టాక్‌తో దూసుకు పోతోంది. నవంబర్ 7న రిలీజైన ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా వీకెండ్ తర్వాత అసలు సిసలు దూకుడు చూపిస్తోంది. మండే టెస్ట్‌లో సాలిడ్‌గా పాస్ కావడంతో పాటు ఓవర్సీస్‌లోనూ రేర్ ఫీట్ అందుకుంది. అక్కడ స్టడీగా రన్ అవుతూ.. నార్త్ అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. కేవలం రష్మిక క్రేజ్ తో అక్కడ హాఫ్ మిలియన్ డాలర్ వసూళ్ల తో పాటు చాలా స్టడీగా రన్ అవుతుండడం చూస్తుంటే రష్మిక పట్ల ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో క్లీయర్ గా తెలుస్తోంది.
ఒక ఫీమేల్ సెంట్రిక్ రొమాంటిక్ డ్రామాకు చాలా పెద్ద మైల్‌స్టోన్ అనే చెప్పాలి. స్టార్ కాస్టింగ్ లేదు.. పెద్ద హంగామా లేదు.. యాక్షన్ హంగాయా లేదు.. అయినా కూడా హీరో పవర్ లేకుండా కంటెంట్ తో పాటు రష్మిక పెర్పామెన్స్ ను నమ్ముకుని ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్.. రాహుల్ రవీంద్రన్ టేకింగ్‌కు .. క్లీన్ ఎమోషన్స్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. రష్మిక కేవలం గ్లామర్ డాల్ గానే కాదు .. తన పెర్పామెన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. సినిమా మొత్తం తన భుజ స్కంధాలపై మోస్తూ బాక్సాఫీస్ నెంబర్లను కూడా మ్యాజిక్ చేయగలను అని ఫ్రూవ్ చేసుకుంది. ఏదేమైనా మరోసారి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కంటెంట్ ఉన్న సినిమాకు కటౌట్ అక్కర్లేదని ఫ్రూవ్ చేసింది. రష్మిక క్రేజ్ ఏంటో మరోసారి ఫ్రూవ్ చేసింది. ఇక రాహుల్ రవీంద్రన్‌కు కూడా 'చి ల సౌ' తర్వాత మళ్లీ ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి