
కానీ అది చాలా చాలా తప్పు అంటున్నారు పెద్దవాళ్ళు. మరీ ముఖ్యంగా రాత్రిపూట సింక్ లో గిన్నెలు ఎక్కడ కి అక్కడ వదిలేస్తే ఆ సింక్లో ఉన్న గిన్నెలపై బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అని.. సరిగ్గా తోముకుండా తింటే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు . అంతేకాదు అలా రాత్రిపూట సింకులో గిన్నెలు ఎక్కడిక్కడ ఉండడం కూడా మంచిది కాదట . రాత్రిపూట కిచెన్ శుభ్రపరుచుకుని పడుకుంటేనే మంచిది అంటున్నారు పెద్దవాళ్ళు .
అంతేకాదు అలా రాత్రిపూట సింకులో ఎక్కడి గిన్నేలు అక్కడే వదిలేసి ఉదయం అవి క్లీన్ చేసుకుని మరల అదే ప్లేట్ లో తినడం కారణంగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి సరిగా క్లీన్ చేయని పక్షంలో ఆ బ్యాక్టీరియా మన పొట్ట లోపలికి వెళ్లి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందట. చాలామంది దాని ద్వారా మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి . వంట గదిలో వ్యాపించే బ్యాక్టీరియా కారణంగా..మనకి జీర్ణసమస్యలు వస్తాయని ..అజీర్తి, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. వీలైనంత వరకూ రాత్రివేళనే పాత్రలన్నీ శుభ్రం చేసి, పడుకోవాలని సూచిస్తున్నారు. అందుకే పెద్దవాళ్లు అంటూ ఉంటారు ఇంట్లో రాత్రిపూట సింకులో గిన్నెలు అలానే వదిలేస్తే యముడు వచ్చి అక్కడ తిష్ట వేస్తాడు అని భయపెడుతూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యం హెల్త్ . కొంచెం సమయం కేటాయించి అలా సింకులో గిన్నెలు లేకుండా క్లీన్ చేసి పడుకుంటే హెల్త్ కి హెల్త్ ప్రశాంతతకి ప్రశాంతత.. పనులు కూడా చకచకా కంప్లీట్ అయిపోతాయి..!!
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది అనే విషయం గుర్తుంచుకోండి..!!