- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్, వసూళ్లు అంటే అదో రికార్డ్. బడ్జెట్ కూడా 100 కోట్లు అంటే భారీ పెట్టుబడి కిందకి వచ్చేది. టాలీవుడ్ లో 100 కోట్ల సినిమా అంటే మాములు విషయం కాదు. అమ్మో రు. 100 కోట్ల సినిమా నా అని నోరెళ్ల పెట్టేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. 100 దాటి 500 కి చేరింది. తరువాత 1000 కోట్ల టార్గెట్ గా మారింది. బడ్జెట్ పెరిగింది. కలక్షన్లు పెరిగాయి. 'బాహుబ‌లి1,2 , ఆర్ ఆర్ ఆర్', 'పుష్ప‌', 'క‌ల్కి 2898 ' మూవీస్ అన్నీ 1000 కోట్లకు పైగా వ‌సూళ్లతో ఇండియ‌న్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. పుష్ప 2 మూవీ సుమారు 1800 కోట్లు వసూలు చేసింది. బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసి, దంగల్ రికార్డ్ వరకు వెళ్ళింది. అందుకే రాబోయే తెలుగు సినిమాల టార్గెట్ 2000 కోట్ల‌గా మారింది.


రానున్న సినిమాలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవే. వీటిలో 'వారాణసి' మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తున్న వారాణసి పై గ్లోబల్ వైడ్ భారీ అంచనాలున్నాయి. వారాణసి మూవీ బడ్జెట్ 700 కోట్లు పైమాటే అని తెలుస్తోంది, టార్గెట్ 2000 కోట్లు అని టాక్. నెక్స్ట్ #AAA కూడా సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంటే వసూళ్ల టార్గెట్ కూడా అదే రేంజ్ లో ఉంది.  2026 లో 1000 కోట్ల వసూళ్లు  టార్గెట్ లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'ది రాజాసాబ్' మూవీ రిలీజ్ కానుంది. ఇలా టాలీవుడ్ రేంజ్ గ‌త మూడు నాలుగేళ్ల‌లో బాగా పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండియా ఎల్ల‌లు దాటేసి ప్ర‌పంచ స్థాయి వైపు ప‌రుగులు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: