
దీనివల్ల బలహీనత, మైకం లేదా తల తిరగడం వంటి సమస్యలు రావొచ్చు. అటువంటి వారు వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు (డయేరియా) లేదా అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ట్రిక్ లేదా పేగు సంబంధిత సమస్యలతో బాధపడేవారు కాకరకాయను మితంగా తీసుకోవడం మంచిది.
గర్భిణీ స్త్రీలు కాకరకాయ లేదా కాకరకాయ రసానికి దూరంగా ఉండటం మంచిది. ఇది గర్భాశయాన్ని ప్రేరేపించే అవకాశం ఉందని, పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు సూచిస్తారు. పాలిచ్చే తల్లులు కూడా దీనిని మితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. కాకరకాయలో ఆక్సలేట్ (Oxalate) అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని అధికంగా తీసుకుంటే, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కాకరకాయను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తారు. ఉదాహరణకు, కాకరకాయ తిన్న వెంటనే పాలు లేదా పాల ఉత్పత్తులు (పెరుగు) తినడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం లేదా చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు రావొచ్చు. అలాగే, మామిడికాయ, బెండకాయ లేదా ముల్లంగి వంటి వాటిని కాకరకాయతో కలిపి తినడం వల్ల కూడా జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడవచ్చు. కొన్ని రకాల కాకరకాయ విత్తనాలలో "వైసిన్" (vicine) అనే విషపూరిత పదార్థం ఉంటుంది, ఇది ఫావిజం (favism) అనే రక్త సంబంధిత సమస్యకు కారణం కావచ్చు. అందువల్ల కాకరకాయ విత్తనాలను తీసివేసి తినడం మంచిది.