కృష్ణా జిల్లాలో అధికార వైసీపీలో మంచి పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేల్లో తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఒకరని చెప్పొచ్చు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రక్షణనిధి తనదైన శైలిలో పనిచేస్తూ.. ప్రజలకు అండగా నిలబడుతున్నారు. పైగా ఇక్కడ టి‌డి‌పి ఉనికి ప్రమాదంలో పడింది. తిరువూరులో టి‌డి‌పికి భవిష్యత్ కనిపించడం లేదు. ఇదే పరిస్తితి కొనసాగితే రక్షణనిధి మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టే అవకాశం కనిపిస్తోంది.

మామూలుగా తిరువూరు టి‌డి‌పికి అనుకూలంగానే ఉండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. కానీ 2004 నుంచి టి‌డి‌పి లక్ బాగోలేదు. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున రక్షణనిధి గెలుస్తూ వస్తున్నారు. ఇలా వరుసగా గెలుస్తున్న రక్షణనిధి ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

 
ప్రభుత్వం తరుపున జరిగే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం తిరువూరులో జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో సమస్యలు కూడా ఉన్నాయి....తిరువూరు టౌన్‌లో అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది. అటు తిరువూరు మున్సిపాలిటీ పరిధితో పాటు, విసన్నపేట, గంపలగూడెం, ఏ కొండూరు మండలాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఎ.కొండూరు మండలంలో ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారిని ఆదుకోవాలి....ఇక్కడొక డయాలసిస్‌ కేంద్రం కావాలని ఎప్పటినుంచో ఆ ప్రాంత వాసుల చేస్తున్న డిమాండ్ అలాగే ఉంది. అలాగే తిరువూరులో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరముంది.

ఇటు రాజకీయంగా వస్తే రక్షణనిధి బలం ముందు టి‌డి‌పి తేలిపోతుంది. పైగా పంచాయితీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. తిరువూరు మున్సిపాలిటీ వైసీపీనే కైవసం చేసుకుంది...20 వార్డుల్లో వైసీపీ 17 గెలుచుకోగా, టి‌డి‌పి 3 చోట్ల గెలిచింది. ఇక తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌సి‌టి ఎన్నికల్లో దుమ్ముదులిపింది. 61 ఎం‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీ 59 గెలుచుకోగా, టి‌డి‌పికి 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. జెడ్‌పి‌టి‌సిలని క్లీన్ స్వీప్ చేసింది.
ఇక టి‌డి‌పికి నాయకులు సరిగా సెట్ కావడం లేదు. 2019 ముందు వరకు నియోజకవర్గాన్ని నల్లగట్ల స్వామీదాసు చూసుకునే వారు...ఆ తర్వాత కే‌ఎస్ జవహర్ చూసుకున్నారు. ఇప్పుడు ఇంచార్జ్‌గా శావల దేవదత్ చూసుకుంటున్నారు. మరి ఈయన రక్షణనిధి హ్యాట్రిక్ విజయానికి ఏ మాత్రం బ్రేక్ వేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: