లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా అనేక వర్గాలకు పలు రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తూ వుండగా.. అలాంటి పాలసీలలో ఎల్ఐసి కొన్ని ప్రత్యేకమైన పథకాలను మరింత పాపులర్ చేసింది. అలా పాపులర్ అయిన పాలసీలలో ఎల్ఐసి జీవన్ ఆజాద్ పాలసీ కూడా ఒకటి. 2023 జనవరిలో ఎల్ఐసి లాంచ్ చేసిన ఈ పాలసీలో ప్రతి ఒక్కరికి కూడా చేరిన వారికి మంచి లాభాలు లభిస్తాయని చెప్పవచ్చు. అయినా రెండు వారాలలోనే 50వేల పాలసీలను ఎల్ఐసి అమ్మింది అంటే నిమిషానికి రెండు మూడు ప్లాన్లను సైతం అందిందని చెప్పవచ్చు.

ఈ పాలసీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే 20 సంవత్సరాల పాలసీకి 12 ఏళ్ల స్పాట్ ప్రీమియం కడితే చాలు.. 12 ఏళ్ల ప్రీమియంలో మీకు 20 ఏళ్ల వరకు కవరేజ్ కూడా లభిస్తుంది. ఎల్ఐసి జీవన్ ఆజాద్ ప్లాన్ యొక్క ప్రత్యేకతలు గమనించినట్లయితే.. వ్యక్తిగత పొదుపు జీవిత బీమా ప్లాన్ అలాగే గరిష్టంగా రూ .5 లక్షల వరకు ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 90 రోజులైతే గరిష్ట వయసు 50 సంవత్సరాలు. ఇకపోతే కనీసం అస్యూర్డ్ రూ.2 లక్షలు కాగా.. గరిష్ట స్యూర్డ్ విలువ రూ .5 లక్షలు.

ఇకపోతే ఎల్ఐసి జీవన్ ఆజాద్ పాలసీని ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. 15 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల టర్మ్ ఎంచుకోవచ్చు . ఇక ఎంత టైం ఎంచుకున్నట్లయితే అందులో ఎనిమిది సంవత్సరాలు తీసేయాలి. ఇక ఎల్ఐసి జీవన్ ఆజాద్ పాలసీలో 20 సంవత్సరాల టర్మ్ తీసుకున్నట్లయితే 8 సంవత్సరాల తీసేసి 12 సంవత్సరాల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ లేకుండా రూ .3లక్షల వరకు సమ్ అస్యూర్డ్ తో పొందవచ్చు. ఈ ప్లాన్లు మీకు ఊహించిన విధంగా లాభాలను అందిస్తాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: