యువహీరో నాగశౌర్య, మెగా హీరోయిన్ నిహారిక ల పెళ్లి జరుగబోతుంది. అవును మీరు చదివినది నిజమే. మెగాఫ్యామిలీకి  సంబంధించిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ సమాచారం బయటకి పొక్కిందట. వీరిద్దరూ  త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు సామాజిక మాధ్యమాలలో కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ప్రేమ కూడా ఇప్పటిది కాదట. వీరి మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం నడుస్తోందని సమాచారం. 


ఇద్దరూ ఒక మనసు అనే సినిమాలో కలసి నటించారు. అప్పట్లోనే వీరిరువురి ప్రేమకు విత్తనాలు చల్లారని సమాచారం. కాగా అప్పటిలో ఇవే రకమైన ప్రేమ వార్తలు రావడంతో నాగశౌర్య అవి వట్టి రూమర్లే అని ఖండించాడు. అయితే ఇప్పుడు మాత్రం అవి రూమర్లు కావని తెలుస్తోంది. కాగా మొదట వీళ్లిద్దరి ప్రేమ పెళ్లికి నిహారిక తండ్రి  నాగబాబు అంగీకరించలేదని, మ్యాటర్  చిరు వరకు వెళ్లడంతో అతని జోక్యంతో కథ కొలిక్కి వచ్చిందని సమాచారం. ఇక చిరు ఓకే చెప్పేయడంతో మొత్తం ఫ్యామిలీ అంగీకరించారట. తాను గతంలో చేసిన తప్పులు చేయద్దని చిరు, నాగబాబుకు హెచ్చరించారని తెలిసింది.


ఈ వార్తల తర్వాత నాగశౌర్య కొత్త సినిమా ఛలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి హాజరుకావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ఆ ఫంక్షన్లో నాగశౌర్య గురించి పొగిడిన తీరు బట్టి చూస్తే ఆ అనుమానం ఇంకా బలపడక మానదు. ఇప్పటివరకైతే ఈ వ్యవహారం సంబంధించి ఇటు నాగశౌర్య నుంచి కానీ, అటు మెగా ఫ్యామిలీ నుండి కానీ ఎటువంటి రెస్పాన్స్ రావకపోవడం వల్ల కూడా అనుమానాలను రేకెత్తిస్తుంది. మరి ఇది రూమరో, నిజమో కాదో తేల్చాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్లు వివరణ ఇచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: