అటు మింగలేక, ఇటుకక్క లేక మధ్యలో, అల్లు అర్జున్ ఇరుక్కుపోయాడా..? అనేది ఇప్పుడు బాగా చర్చనీయమైన విషయం గా మారిపోయింది. జనాలు మాట్లాడుకుంటున్న మాటలు అయితే  “అవును” అనే సమాధానం ఇస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ అంటే చాలా మందికి ఇష్టం . ఒక స్టార్ హీరో..ఒక్కో సినిమాకి  100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరో.. బిగ్ స్టార్ కాబట్టి ఆయన గురించి మాట్లాడే ప్రతీ సందర్భంలో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మరి ముఖ్యంగా  సినిమా కథలను తీసుకునే విధానం పూర్తిగా మారిపోయింది.


ఇప్పుడు ఆయనకి  చిన్నాచితక సినిమాలు ఆనడం లేదు. ఆయన  ఒక్క బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఉన్న, భారీ కాన్సెప్టు, గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాలు మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోణేను హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. మేకర్స్ ఇప్పటి వరకు దీపికా పదుకునె విషయంలో ఎటువంటి అబ్జెక్షన్ చూపించలేదు. అయితే, సందీప్ రెడ్డి దర్శకత్వంలోని స్పిరిట్ సినిమా సమయంలో దీపికా పదుకొనె ను తప్పించడం..ఆ తర్వాత “కల్కి 2” నుండి కూడా ఆమెను తొలగించడం వంటి కారణాల వల్ల, ఆమె పేరుపై నెగిటివిటీ క్రియేట్ అయ్యింది.

 

దీంతో, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకొనెను తీసేయాలి అనే ప్రెజర్స్ బలంగా వస్తున్నాయి. ఒకవేళ దీపికా పదుకొనె ను ఈ సినిమా నుండి తీసేయాలంటే, ఇప్పటికే చిత్రీకరించిన సీన్స్ సగంకి  పైగా డిలీట్ చేయాలి, దీనివల్ల మేకర్స్‌కు భారీ నష్టం వస్తుంది. మరోవైపు, ఆమెను పెట్టి నెక్స్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తే, ప్రభాస్ ఫ్యాన్స్, సందీప్ రెడ్డి ఫ్యాన్స్, మరియు కల్కి మూవీ మేకర్స్ ఫ్యాన్స్ నుండి ఈ సినిమాపై నెగిటివిటీ వస్తుంది.  తద్వారా మేకర్స్‌కు మరిన్ని నష్టాలు కలగవచ్చు అని అంటున్నారు.



ఈ కారణంగా, అల్లు అర్జున్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. జనాలు చెబుతున్నట్టు, ఆయన “అటు మింగలేక, ఇటుకక్క లేక” మధ్యలో పూర్తిగా ఇరుక్కుపోయాడు అన్నది నిజం. పుష్ప 2 సినిమా సందర్భంలో ఇప్పటికే ఎదుర్కొన్న ఇబ్బందులను మళ్లీ ఎదుర్కోవడం వద్దు అనుకుని ఆయన సైలెంట్ అయిపోయాడట.  డబ్బులు వృధా అవ్వడం వంటి కారణాల వల్ల మేకర్స్ దృష్టిలో నెగిటివిటి ఏర్పర్చుకోవడం కన్నా సైలెంట్ గా ఉండటమే బెటర్ అంటూ ఇలా ఉండిపోయారట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: