
విజయ్ పార్టీ నాయకులు కేవలం 10,000 మందితోనే ర్యాలీ నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నారని కానీ ఆ సంఖ్యకు మించి మరి అభిమానులు వస్తారని మేము అంచనా వేశాం .వీటికి తోడు టీవీ కే సోషల్ మీడియాలో విజయ్ ర్యాలీకి మధ్యాహ్నం 3:00 గంటలకే వస్తారని ప్రకటించారు. కానీ ఆయన వచ్చింది రాత్రి 7:30 నిమిషాలకు అంటూ తెలిపారు. దీంతో ఆ ప్రదేశంలో చాలామంది అభిమానులు అక్కడికి చేరుకొని ఆయన కోసం ఎదురు చూశారు. అధికారులు ఈ ర్యాలీ కోసం 1.2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అక్కడ కేటాయించారని.. సుమారుగా 2000 మంది సిబ్బందిని సీనియర్ అధికారులు ఇక్కడికి పంపించామని తెలిపారు.
అలాగే అక్కడికి ఏకసభ్య కమిషన్ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డీజీపీ డీజీపీ వెంకట్రామన్ తెలియజేశారు. గతంలో కూడా అన్నాడీఎంకే ర్యాలీ ఇక్కడి నుంచే మొదలయ్యిందని వెల్లడించారు. కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అటు సినీ నటుడు విజయ్ కు సంబంధించి ఇద్దరు సహాయకుల పైన,పార్టీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఇందుకు సంబంధించి విచారణ కూడా చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ ప్రాథమిక ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టబోతున్నట్లు లా అండ్ ఆర్డర్ ఏ డీజీపీఎస్ డేవిడ్సన్ ధ్రువీకరించారు.