
వాస్తవంగా చెప్పాలంటే సాహో టీజర్ చూసిన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ప్రేక్షకులకు మాత్రం కొన్ని అనుమాలు అలానే ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి స్థాయిని చేరుతుందా అని. అందులోని భారీతనం గురించి అటుంచితే ఈ సినిమామ్యూజిక్ ఇచ్చిందెవరు అని..అంతేకాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా. అయితే ఇది మ్యూజిక్ డైరక్టర్ గిబ్రాన్ అని చాలామంది అనుకున్నారు. కానీ అది గిబ్రాన్ మ్యూజిక్ కాదని తెలుస్తోంది. కేవలం ఈ టీజర్ కోసం ఓ హాలీవుడ్ ప్రీరికార్డెడ్ ఆర్ ఆర్ బిట్ ను యువి క్రియేషన్స్ భారీ మొత్తం రాయల్టీగా చెల్లించి, తెచ్చుకునట్లు తెలుస్తోంది. ఆ మ్యూజిక్ బిట్ ను గిబ్రాన్ మరికాస్త ఎక్స్ టెండ్ చేసినట్లు సమాచారం..
రాయల్టీగా పది నుంచి పదిహేను లక్షల భారీ మొత్తం చెల్లించి, ఆర్ ఆర్ బిట్ ను తెచ్చారని, దానిని ఇప్పుడు టీజర్ కు వాడారని తెలుస్తోంది. సినిమాకు ముందుగా అనుకున్న శంకర్ - ఎహసాన్ - లాయ్ ల ట్యూన్లు అంతగా నప్పకపోవడంతో, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరక్టర్ల చేత ఒక్కోపాట చేయించాలని సాహో మేకర్లు నిర్ణయించారు. నేపథ్య సంగీతం మాత్రం గిబ్రాన్ చేస్తాడు. అయితే అక్కడక్కడ వాడే సిగ్నేచర్ ట్యూన్ గా మాత్రం టీజర్ లో వినిపించే మ్యూజిక్ బిట్ వుంటుందని లేటెస్ట్ న్యూస్.