
పూనమ్ పాండే ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే.. న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం రేపింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది. ఇటీవల ప్రత్యేకంగా ఒక యాప్ మెయిన్ టైన్ చేస్తూ అందాల ఆరబోత మరింత పెంచేసింది. ఆ వీడియో లకు సంబంధించిన హాట్ ప్రోమో లను ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేస్తూ కుర్రాళ్ళ మనసు పాడు చేస్తుంది.
ఈ భామ బాలీవుడ్ లో ‘లేడీ గబ్బర్ సింగ్’ ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాలతో కాస్తా హడావిడి చేసినా ఏమి కలిసిరాలేదు. దీంతో ఎపుడు వివాదాస్పద ప్రకటనలతో పాటు..పర్సనల్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా లో, వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే పూనమ్ పాండే అపుడపుడు తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఆమె చేసే పోస్ట్ లపై నెటిజన్లు కూడా హద్దులు దాటి రియాక్ట్ అవుతుంటారు. అయిన ఈ బోల్డ్ బ్యూటీ అందాలను ఆరబోయడంలో ఎపుడు ముందుంటుంది. అయితే ఎపుడు హాట్ వీడియో లు పెట్టే పూనమ్ ఈ సారి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. తాను గతంలో చేసిన బంగీ జంప్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఎప్పుడు హాట్ వీడియోలు షేర్ చేసే పూనమ్ ఇలాంటి వీడియో షేర్ చేయటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది.