
సినిమా కెరీర్ అనేది శాశ్వతం కాదు. అందుకే తారలు ఫాంలో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. అయితే నటుగా ఉన్న వారు కేవలం నటులుగానే కాకుండా ఫాంలో ఉండగానే ఇతర బిజినెస్‌ల మీద దృష్టి పెడుతున్నారు. ఫాంలో ఉండగానే బిజినెస్ రంగంలోనూ సెటిల్ అవ్వాలని భావిస్తున్నారు. అదే బాటలో చాలా మంది స్టార్స్ వివిధ రంగాల్లో బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్నారు. అయితే కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రం తమ గ్లామరే పెట్టుబడి బిజినెస్ చేస్తున్నారు.
బాలీవుడ్‌లో హాట్ బ్యూటీస్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే. తెర మీద అందాలు ఆరబోయటంలో ఏ మాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మలు అదే తమకు సరైన బిజినెస్ అని భావించారు. తమ గ్లామర్ వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. అవి చూడాలంటే డబ్బు చెల్లించాలంటూ బిజినెస్ చేస్తున్నారు. హాట్ వీడియోస్‌కు ఎక్కువ పోర్న్ వీడియోస్‌కు తక్కువగా ఉన్న ఈ వీడియోలకు ఓ రేంజ్‌లో రెస్సాన్స్ వస్తోంది. షెర్లిన్ చోప్రా యాప్‌ను 50 వేల మందికి పైగా సబ్‌స్క్రైబ్ కాగా.. పూనమ్ పాండే యాప్‌కి అయితే లక్షల సంఖ్యలో సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి.
పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలు సొంతంగా యాప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ యాప్‌లలతో తమ ప్రైవేట్ వీడియోస్‌ను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ యాప్‌లో వీడియోలను చెల్లించాలంటే మాత్రం డబ్బు చెల్లించాల్సిందే. దాదాపు న్యూడ్ గా ఉన్న వీడియోలను కూడా ఈ యాప్‌లలో షేర్ చేస్తున్నారు ఈ అందాల భామలు. ప్రస్తుతానికి డిజిటల్ రంగంపై ఎలాంటి సెన్సార్ నింబంధనలు లేకపోవటంతో వీళ్ల బిజినెస్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. పూనమ్, షెర్లిన్‌ల బిజినెస్‌గా సాగుతుండటంతో మరింత మంది హీరోయిన్లు ఈ బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రియాసేన్ లాంటి వారు కూడా ఈ బిజినెస్‌లో అడుగుపెట్టారు.