తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనే విషయం తెలుసిందే . అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమాలు వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు మాత్రం డిమాండ్ మరింతగా ఉంటుంది. ఎందుకంటే యువతను ఆకర్షించే సినిమాలకు యూత్ మాత్రమే వెళ్తారు... యాక్షన్ సినిమాలకు మాస్ ప్రేక్షకులకు మాత్రమే... అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే కుటుంబ సమేతంగా వెళ్లి ఎంతో హాయిగా సినిమా చూసి వస్తారు. 

 

 అందుకే ఇలాంటి సినిమాలకి తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా క్రేజ్ ఉంటుంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినీమాలకి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు. అందుకే దాదాపుగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్ ని.. అందరి మధ్య బంధాలను అనుబంధాలను గుర్తుచేస్తూ... ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రజలందరికీ ఆకర్షిస్తున్న సినిమా సంక్రాంతి. 

 


 సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఏ  ఛానల్ పెట్టిన ఈ సినిమానె  వస్తుంది. ప్రతి సంక్రాంతికి కుటుంబ బంధాల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. కుటుంబ బంధాలను తెలియజేస్తూ ఫ్యామిలి  ఆడియన్స్ అందరిని ఆకర్షిస్తుంది ఈ సినిమా . వెంకటేష్ శ్రీకాంత్ శివబాలాజీ శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించిన సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా కు ఫిదా అవ్వని  ప్రేక్షకుడు  లేడు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సంక్రాంతి సినిమా లాంటి అను బంధాలను గుర్తు చేసే సినిమా లు చాలా తక్కువ గానే వస్తున్నాయి అని చెప్పాలి. అందుకే అలనాటి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకి మంచి గుర్తింపు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: