నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అనగానే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి సహా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా క్రేజ్ చాలా ఎక్కువ. బాలయ్య సినిమా అనగానే ఫాన్స్ చేసే హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది అనే సంగతి తెలిసిందే. సినిమాలో దాదాపుగా ప్రతీ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఏదోక కథనం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. మీడియా కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఏదోక విధంగా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమా మీద కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్ అనగానే మాస్ కి ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వార్త వచ్చినా సరే మాస్ చాలా ఆసక్తిగా ఈ సినిమా గురించి ముందు నుంచి కూడా అదే విధంగా చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. బాలయ్య కొడుకుగా నటించే సూచనలు ఉన్నాయి అనే టాక్ బాగానే వినపడుతుంది. మరి నిజం ఎంత అనేది చూడాలి. 

 

ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఫాన్స్ కి విడుదల చేసారు. దానికి మంచి స్పందన అనేది వచ్చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్ కూడా ఒక రేంజ్ లో ఉంది అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడగా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: