సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "అతిధి" సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో
మహేష్ తో కలిసి చిందులేసింది మలైకా అరోరా. తన హాట్ హాట్ స్టెప్ లతో కుర్ర కారుల మతులు పొగగొట్టింది. తర్వాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "గబ్బర్ సింగ్" లో
కెవ్వు కేక అంటూ ఐటమ్ సాంగ్ చేసి కెవ్వు మనిపించింది. ఆ తర్వాత నుంచి
టాలీవుడ్ లో ఏ
మూవీ లో ఐటమ్ సాంగ్ చెయ్యలేదు ఈ హాట్ ఐటమ్ బేబీ. ఇప్పుడు ఈమె గురించి ఒక హాట్ న్యూస్ మీకోసం అందిస్తుంది
ఇండియా హెరాల్డ్. కామ్... చదవండి... !!!!

బాలీవుడ్ ఐటమ్ బేబీ
మలైకా అరోరా భర్తతో విడిపోయి చాలా కాలమే అవుతుంది. 1998లో
సల్మాన్ తమ్ముడు
అర్భాజ్ ఖాన్ ని
ప్రేమ వివాహం చేసుకున్న ఈమె 2017లో విడాకులు తీసుకొని విడిపోయింది. భర్తతో విడిపోయాక ఆమె యంగ్
హీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ పెట్టుకుంది. తన కంటే చిన్నవాడైన
అర్జున్ కపూర్ తో ఆమె సాగిస్తున్న ప్రేమాయణాన్ని అప్పట్లో కొత్తగా చెప్పుకున్నారు. ఐతే ఈ జంట తమ ఎఫైర్ ని పబ్లిక్ చేయడంతో పాటు, అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.
ఐతే
అర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు విడాకులు ఇవ్వడానికి అసలు కారణం
అర్జున్ కపూర్ తో ఆమెకు ఉన్న ఎఫైర్ అని సమాచారం.
అర్జున్ కపూర్,
మలైకా అరోరా మధ్య ఎఫైర్ 2017కి ముందు నుండే ఉందట. ఈ విషయం తెలుసుకున్న
అర్బాజ్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చారట. కాగా
అర్జున్ కపూర్,
అర్బాజ్ ఖాన్ ల ఎఫైర్ బయటకు రావడానికి కారణం
మలైకా అరోరా డ్రైవర్ అట.
మలైకా
డ్రైవర్ గా పనిచేస్తున్న
ముఖేష్ అనే వ్యక్తి
మలైకా,
అర్జున్ ల మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారట.
ముఖేష్ అర్భాజ్ ఖాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న బబ్లు అనే వ్యక్తితో ఈ విషయాలు పంచుకున్నారట. బబ్లు తన యజమాని
అర్బాజ్ ఖాన్ కి ఈ విషయం లీక్ చేశాడని సమాచారం.
ఇక పోతే ప్రస్తుతం
మలైకా అరోరా ఒక ప్రముఖ
బాలీవుడ్ డాన్స్
రియాలిటీ షో అయినటువంటి ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అనే షో కి ఒక న్యాయ నిర్ణేతగా పని చేస్తుంది.