హీరో రిషబ్ శెట్టి డైరెక్టర్ గా, హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇందులో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాని చూసిన చాలామంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా పైన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.



రిషబ్ శెట్టి చేసిన ప్రయత్నాన్ని చూసి దేశంలో ఉండే దర్శకులు కూడా సిగ్గుపడాలి అంటూ వర్మ తెలియజేశారు. 2022 లో వచ్చిన కాంతార సినిమాకి ఫ్రీక్వల్ గా కాంతార చాప్టర్1 చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో తనని తాను డైరెక్టర్గా, రచయితగా మళ్లీ నిరూపించుకున్నట్టు కనిపిస్తోంది. వర్మ ట్విట్టర్ లో ఇలా రాసుకొస్తూ.. "రిషబ్ శెట్టి, అతడి టీం, బిజిఎం, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ , ప్రొడక్షన్ డిజైనర్ తో ఎవరు ఊహించలేని ప్రయత్నాన్ని చేసి చూపించిన తర్వాత భారత దేశంలో ఉండే ఫిలిం మేకర్స్ సిగ్గుపడాలి.. కంటెంట్ గురించి మాట్లాడితే అది ఒక బోనస్ లాంటిది కేవలం వారి ప్రయత్నం వల్లే కాంతార చాప్టర్1 సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి అర్హత ఉందంటూ తెలిపారు.

హోంభలే ఫిలిం  ఎక్కడ రాజీ పడకుండా మద్దతు ఇవ్వడం కూడా గ్రేట్ అని.. హే రిషబ్ మీరు గొప్ప దర్శకుల లేకపోతే గొప్ప నటుల అనే విషయాన్ని తాను నిర్ణయించుకోలేకపోతున్నానంటూ తెలిపారు.. అయితే ఈ విషయానికి రిషబ్ స్పందిస్తూ.. నేను కేవలం సినిమా లవర్ ని మాత్రమే సార్ మీ ప్రేమ, మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. కాంతార చాప్టర్1 చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ ,ఇంగ్లీష్, హిందీ ఇలాంటి భాషలలో విడుదల చేశారు. ఇందులో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: