
కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు సామ్ బాంబేను వివాహమాడింది. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. 'నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నా' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించిన పూనమ్.. 'నషా' సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేది. ఇటీవల జులై నెలలో సామ్ తో నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ తాజాగా పెళ్లి పీటలెక్కింది. వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఇటీవల తన ప్రియుడు సామ్ బాంబేను వివాహమాడిన ఈమె.. అంతలోనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది.
దీంతో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా కోసం పూనమ్.. గోవాలోని క్యానాకోనాకు షూటింగ్కు వెళ్లిన సమయంలో జరిగిందీ ఘటన. బాలీవుడ్ నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్ పాండే.. నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై క్రిమినల్ కేసు పెట్టింది. అతడి వల్ల గత కొద్ది నెలల నుంచి మానసిక క్షోభకు గురవతున్నానని పేర్కొంది. గతంలో పూనమ్.. ఓ మొబైల్ యాప్ కోసం రాజ్ కుంద్రా భాగస్వామిగా ఉన్న ఆర్మ్స్ ప్రైమ్ మీడియాను సంప్రదించింది. అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నుంచి తనకు అదే పనిగా, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పిందీ భామ.