
భర్త శారీరకంగా హింసిస్తున్నారు, వేదింపులకు గురిచేస్తున్నాడు అంటూ ఆమె గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది..ఆమె వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్ బాంబే ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత రోజే గోవా కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది.అతనితో రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న పూనమ్, ఇటీవల పెళ్లి చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు లేని కారణాలు ఇప్పుడు వచ్చాయా అంటూ అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూ లో పూనమ్ పాండే సమాధానం ఇచ్చింది.అతనితో రిలేషన్ లో ఉన్నపుడు కూడా నరకంగానే ఉండేది.
ఎప్పుడు చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకొని నోటికి వచ్చినట్లు తిట్టేవాడు. అతనిలో మార్పు వస్తుందని ప్రయత్నించాను కానీ అతను మారలేదు. పెళ్లి తర్వాత మరీ ఎక్కువగా శారీరకంగా టాచర్ పెడుతున్నారు. అందుకే కేసు పెట్టాను అని పూనమ్ చెప్పుకొచ్చింది. గోవాలో నేను షూట్ కి వెళ్లి వచ్చాక తన అనేక రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. .. నన్ను కొట్టాడు. చిత్రహింసలకు గురి చేశాడు. నా జుట్టును పట్టుకొని అమాంతం మంచానికి కొట్టాడు.మొహం పై గుద్దాడు. ఇలా ఒకటేమిటి చెప్పుకోలేని చోట నాకు నరకం చూపించాడు.అతని బారి నుంచి తప్పించుకొని హోటల్ సిబ్బంది సాయంతో పోలీసులను ఆశ్రయించాను.దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.. కానీ ఇప్పుడు బయటకు వచ్చాడు. కేసు పెట్టానని కక్ష్య సాధిస్తాడని భయమేస్తుంది అంటూ భర్త గురించి బయట పెట్టింది పూనమ్.