పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న వకీల్ సబ్ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా సినిమా కూడా చేస్తున్నారు. కాగా వకీల్ సాబ్ సినిమాని దిల్ రాజు, బోనీకపూర్ నిర్మిస్తుండగా క్రిష్ జాగర్లమూడి సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రముఖ నిర్మాత ఏ. ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు.

ఇక వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభించనుంది. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఇటీవలే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మగువా మగువా లిరికల్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మరోవైపు క్రిష్ జాగర్లమూడి సినిమా కూడా లాక్ డౌన్ కు ముందు రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోగా దాని తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభిచేలా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు ఆపై సురేందర్రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్న పవన్ కళ్యాణ్, ఈ నాలుగు సినిమాల తర్వాత ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన అయ్యప్పన్ కోషియం అనే సినిమా తెలుగు రీమేక్ లో కూడా నటించాలని ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక దీనితో పాటు మరొక భారీ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నారని, దానిని యువ హీరో నితిన్ నిర్మించనుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఈ విధంగా మొత్తం పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే మొదటిసారిగా ఒకేసారి ఆరు సినిమాలు లైన్లో పెట్టారని, ఇలా ఒకేసారి అరడజను సినిమాలు ఎంచుకుని కొనసాగుతున్న పవర్ స్టార్ మాదిరిగా ప్రస్తుతం మరే ఇతర హీరో చేతిలో కూడా ఒకేసారి ఇన్ని సినిమాలు లేవని, ఒకరంగా ఇది పవన్ కళ్యాణ్ మాత్రమే దక్కించుకున్న ఒక గొప్ప రికార్డు అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: