ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. హాట్ బ్యూటీ  హెబ్బా పటేల్   ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో  టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఈ హాట్ బ్యూటీ. తరువాత హెబ్బా పటేల్‌‌కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, నిఖిల్, వరుణ్ తేజ్, రామ్  లాంటి యంగ్ హీరోలతో నటించి పర్‌ఫెక్ట్ జోడి అనిపించుకుంది.ఇక వరుస ఆఫర్లు వస్తున్నాయని ఆలోచించకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తూ తన క్రేజ్ ని పోగొట్టుకుంది.

అరుణ్ ఆదిత్‌తో '24 కిస్సెస్'లో నటించి బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో యూత్‌కి బాగానే కనెక్ట్ అయినా ఆ సినిమా దారుణంగా పరాజయం కావడంతో హెబ్బాను పలకరించేవారే లేకుండా పోయారు. నితిన్ ‘భీష్మ’లో చిన్న క్యారెక్టర్‌లో మెరిసినా అది ఆమె కెరీర్‌కు బూస్టప్ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా చిన్న హీరో అయిన రాజ్‌తరుణ్‌తో వరుస సినిమాలు చేయడం అవి ఫ్లాప్ కావడంతో యంగ్ హీరోలు సైతం ఆమెను కన్నెత్తి చూడటం లేదంట. ఈలోగా కృతి శెట్టి, నేహ శర్మ, కేతిక శర్మ వంటి యంగ్ బ్యూటీస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇక ఆమెకు హీరోయిన్‌ ఛాన్సులు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఐటెమ్ సాంగ్స్ చేసేందుకు రెడీ అంటోంది.రామ్ నటిస్తున్న ‘రెడ్’ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది.

 ఈ సినిమా విడుదలైన తర్వాత ఐటెమ్ గాళ్‌గా అయినా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. సినిమా ఆఫర్లు రాకపోవడంతో వెబ్ సిరీస్‌లపై అడుగులు వేస్తోంది. నిజానికి హెబ్బా పటేల్‌ అందంగా ఉంటుంది... వాటిని ప్రదర్శించడానికి వెనుకాడదు కూడా. ఎలాంటి పాత్రలకైనా అడ్డు చెప్పదు. కానీ ఇండస్ట్రీలో అందం, టాలెంట్ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి మరి.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: