జబర్దస్ట్ అనగానే టీం లీడర్స్‌తో పాటు సుధీర్, రష్మీ కెమిస్ట్రీ గురించి కూడా టక్కును గుర్తుకు వస్తుంది. సుధీర్, రష్మీ జోడీ అంతలా బుల్లితెరపై హిట్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా జబర్దస్ట్‌లో మరో కొత్త జోడీకి కూడా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. వారెవరో కాదు ఇమ్మాన్యూయేల్, వర్ష. ఇమ్మాన్యూయేల్, వర్ష జోడీకి అభిమానులు ఫిదా అవుతుండటంతో మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ కూడా వీరిని అనేక స్టేజ్‌ల మీద పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇలా ఇప్పుడు వీరి జంట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. వీరిద్దరూ సోలోగా తమ ప్రతిభను చాటుకున్నప్పటి కంటే.. ఇద్దరూ కలిసిన తరువాతే ఇద్దరి కెరీర్లకు రెక్కలొచ్చాయని చెప్పాలి. టీం లీడర్స్ కంటే జోడీలుగా ఉన్న వారికే త్వరగా పాపులారిటీ వచ్చేస్తోంది.

ప్రేక్షకులు కూడా ఇటువంటి వారి స్కిట్‌లను, పెర్ఫార్మెన్స్‌లను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా కెమిస్ట్రీ నడుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇమ్మాన్యూయేల్ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ వర్ష ఇప్పటికే అనేక సార్లు చెప్పింది. పైగా ఇమ్మాన్యూయేల్‌ను ముద్దుగా ఇమ్మూ అని పిలుస్తుంటుంది. అయితే వీరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై తాజాగా అదిరే అభి స్పందించాడు. తనకు తెలిసినంత వరకు ఇమ్మూ, వర్ష మధ్య ఉన్నది స్నేహమే అని, అంతకు మించి మరేమీ ఉండకపోవచ్చునని చెప్పుకొచ్చాడు.

తనకు సుధీర్, రష్మీ మంచి స్నేహితులనే విషయం బాగా తెలుసని, అయితే వర్ష, ఇమ్మాన్యూయేల్‌తో తాను పెద్దగా టచ్‌లో ఉండనని, స్కిట్ అయిన వెంటనే ఎవరికి వాళ్లు వెళ్లిపోతామని అన్నాడు. అదిరే అభి కచ్చితంగా వారి మధ్య ఉన్నది స్నేహమే అని చెప్పకపోవడంతో.. వీరి మధ్య ఇంకేదో నడుస్తోందనే హింట్ ఇచ్చినట్టు అయింది. పైగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ రోజు రోజుకూ పెరిగిపోతూ వెళ్తోంది. సుధీర్, రష్మీ జంటకు పోటీగా వచ్చేశారని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: