
కామెడీ స్టార్స్'లో చమ్మక్ చంద్ర స్కిట్లు పరిధిని దాటి ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం కొద్ది రోజులుగా అతడి స్కిట్లలో మసాలా ఎక్కువ అవుతుండడమే. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు వెగటు పుట్టించేలా మేనరిజం చూపించడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం అతడు చేసిన స్కిట్‌తో విమర్శలు వచ్చాయి.వచ్చే వారం ప్రసారం కానున్న 'కామెడీ స్టార్స్' ఎపిసోడ్ ప్రోమో రెండు రోజుల క్రితం విడుదలైంది. ఇందులో కూడా చమ్మక్ చంద్ర ఫ్యామిలీ స్కిట్‌నే చేశాడు. రావడం రావడమే అదిరిపోయే సాంగ్‌తో సందడి చేసిన అతడు..
ఆ వెంటనే తన పంథాలో సాగే ఓ కుటుంబ నేపథ్యం ఉన్న స్కిట్‌ను ప్రారంభించాడు. ఇలాంటి సమయంలోనే జడ్జ్ శ్రీదేవి విజయ్‌కుమార్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగింది.ఎప్పటి లాగే చమ్మక్ చంద్ర.. భర్తల కష్టాల గురించి ఈ స్కిట్‌లో చెప్పుకొస్తున్నాడు. ఇంతలో అతడి కొడుకు క్యారెక్టర్ వచ్చి 'నాన్న ప్రపంచంలో నీరు మూడు శాతం, భూమి ఒక శాతం ఉందంట నిజమేనా' అనగా 'అది కూడా లేదురా. భర్తల కన్నీళ్లతో నీరుగా మారింది' అని బదులిచ్చాడు. దీంతో వెంటనే శ్రీదేవి కలగజేసుకుని 'చంద్ర ఒకసారి మీ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి' అంటూ అడిగేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు...!!