సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ "జీఎంబి ప్రైవేట్ లిమిటెడ్ " ను ప్రారంభించి ఇప్పటికే ఆరు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. " శ్రీమంతుడు " సినిమాతో ఈ బ్యానర్ ను స్థాపించి తన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు తన బ్యానర్ లో తన సినిమాలకు మాత్రమే సహ నిర్మాతగా వ్యవహరించిన మహేష్ మొదటి సరిగా "మేజర్ " సినిమాతో బయటి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 గూఢచారి, క్షణం, ఎవరు, వంటి విభిన్న సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక " మేజర్ " సినిమా పై ప్రేక్షకుల్లో మొదటి నుండి కూడా మంచి ఆసక్తి నెలకొంది. ముంబై 26/11 ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళం వర్షన్‌ను పృథ్వీరాజ్‌ రిలీజ్‌ చేశారు. టీజర్ విషయానికొస్తే అగ్నికీలల్లో కాలిపోతున్న హోటల్‌లో అమాయకులను కాపాడేందుకొచ్చిన వీరుడిలా అడివి శేష్‌ కనిపిస్తున్న సీన్‌తో టీజర్‌ మొదలవుతుంది.

 అసలు సోల్జర్ ఎందుకు అవ్వాలని అనుకుంటున్నావ్.. దేశభక్తా?’.., ‘దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సైనికుడి పని’.. ఇలాంటి డైలాగ్స్‌ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిపోయాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అద్భుతమైన విజువల్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చేయాలనుకుంటున్నారు ఇక ఈ సినిమా జూలై 2 న పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చెయ్యబోతున్నారు. ఇక ఈ సినిమాతో ఇక ఈ సినిమాతో మహేష్ నిర్మాతగా బయటి హీరోతో తొలి విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. . 
 

మరింత సమాచారం తెలుసుకోండి: