సమీరా రెడ్డి.. ఈమె గురించి సినీ ఇండస్ట్రీలో పరిచయం లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈమె ఎవరేమనుకున్నా సరే, తనకు నచ్చినట్టుగా ఉండాలనుకునే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ సమీరారెడ్డి. ఈ క్రమంలోనే ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ప్రసవం తరువాత అధిక బరువు గురించి ఎంతోమంది చేసిన విమర్శలు, కామెంట్లను తట్టుకుంటూనే తనదైన రీతిలో, సున్నితంగా తిప్పికొడుతూ వచ్చింది ఈ క్యూట్ మామ్.. ఇక ఇప్పుడు ఫిట్ గా మారే పనిలో బిజీగా ఉన్నానని, అందులో భాగంగానే తనను తాను ప్రోత్సహించడానికి" ఫిట్నెస్ ఫ్రైడే" పేరుతో సరికొత్త  కార్యక్రమాన్ని రూపొందించుకున్నానని చెప్పుకొచ్చింది.. అయితే ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


సమీరా రెడ్డి తాను పాటించే ఎన్నో ఫిట్నెస్ టిప్స్ ని ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ,  తన ఫ్యాన్స్ లో పూర్తి మనోధైర్యాన్ని నింపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ లైలా కపాడియా తో ముచ్చటించింది.. ఇక ఈ క్రమంలో " ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ " గురించి ఆమె పంచుకున్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం ..


ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డైట్ కాదు.. ఏం తినాలి అన్న విషయం కంటే ఎప్పుడు తినాలి అన్న విషయం గురించి ఇది చెబుతుంది. చాలామంది బరువు తగ్గడం లో భాగంగా దీన్ని అనుసరిస్తుంటారు.. అయితే నిజం చెప్పాలంటే ఫాస్టింగ్ అనేది మన సాంప్రదాయం లో ఒక భాగం. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అదెలా అంటే, ఉపవాసం ఉన్న సమయంలో జీర్ణవ్యవస్థకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక ఈ ప్రక్రియే మనల్ని పునరుత్తేజం చేస్తోంది. అది క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది..


ఇక ఎవరైతే కొత్తగా ఈ ఫాస్టింగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్నారో,  వారికి ఈమె ఇచ్చిన సలహాలు ఏంటంటే.. ఎవరైతే  కొత్తగా ఈ ఉపవాసం ప్రారంభించాలని అనుకుంటున్నారో, వారు ముందుగా ఎన్ని గంటల  కోసం ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోవాలి.. అంటే కనీసం 12 గంటల తో మొదలుపెట్టి,  14 నుండి 16 గంటల దాకా ఉపవాసం చేయవచ్చు. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు భోజనం పూర్తి అయితే, మరునాడు ఉదయం 8:00 దాకా ఏమీ తీసుకోకూడదు. ఇలా చేస్తే మీరు 12 గంటలు ఉపవాసం చేసినట్లు లెక్క. అదే 14 గంటల అయితే ఉదయం 10 గంటలకు, 16 గంటల కోసం అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.. అయితే మొదట కొత్తగా ప్రారంభించాలి అనుకునేవారు 12గంటల తో మొదలు పెట్టి, ఆ తరువాత మీ శరీరాన్ని,  ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ గంటలను పెంచుకోవచ్చు.. ఇది కూడా మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన విషయం అని గుర్తు పెట్టుకోవాలి అంటే ఆమె చెప్పుకొచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి: