పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చూస్తూ బిజీబిజీగా ఉన్నారు. మూడేళ్ల తరువాత వకీల్ సాబ్‌తో మంచి హిట్ అందుకున్న పవన్.. అదే ఊపులో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మళయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మళయాళ మువీని రీమేక్ చేస్తున్నాడు. దానితో పాటు క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ ఎంటర్‌టైనర్‌గా హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం అందరి దృష్టి వీరమల్లు సినిమాపైనే ఉంది. ఈ చిత్రంలో పవన్ సరికొత్తగా ఓ బందిపోటు పాత్రలో కనిపించనుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మొదట వచ్చిన టైటిల్ రివియల్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లను ఇచ్చేందుకు దర్శకుడు క్రిష్ రెడీ అవుతున్నాడు. అందులో ప్రధానమైంది సినిమా టీజర్. పవన్ బర్త్ డే సందర్బంగా టీజర్‌ను విడుదల చేసేందుకు క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నాడట. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. ప్రతి చిన్న సందర్భంలోనూ డైరెక్టర్ క్రిష్ ప్రత్యేక పోస్టులు పెడుతుండడం, దాంతో సినిమాపై అంచనాలు పెంచుతుండడం చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.


చిన్న చిన్న సందర్భాల్లోనే కీలక విషయాలను రివీల్ చేస్తున్న క్రిష్.. పవన్ బర్త్‌డే కూడా అలానే భారీగా ప్లాన్ చేస్తాడని, అందులో భాగంగానే టీజర్ రిలీజ్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆగస్టులో నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.

కాగా.. ఈ సినిమాలో పవన్ ఓ బందిపోటు దొంగగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం మ్యూజిక్ అందిస్తుండగా.. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: