సెలబ్రెటీలపై సామాజిక మాద్యమాల ప్రభావం బాగానే ఉంటుంది. ఒక్కోసారి వారి ఎదుగుదలకు బాగా ఉపయోగపడితే.. ఒక్కోసారి వారి క్రేజ్ ను తగ్గించేస్తుంది కూడా. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. ముఖ్యంగా మన భారతదేశంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. పుట్టుకొస్తున్న గాసిప్స్ సెలబ్రెటీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సామాజిక మాద్యమం  ప్రభావానికి టెక్నీషియన్లు కూడా బలైపోతున్నారు.  

సోషల్ మీడియాను అవసరానికి మించి ఉపయోగిస్తున్నారు. అలా చాలామంది ఇబ్బందుల్లో కూడా పడుతున్నారు. సదరు వ్యక్తి మంచి ఉద్దేశంతో సేవా కార్యక్రామాల్లో పాల్గొన్నా దాని వెనుక వేరే ఉద్దేశం ఉందంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఇది ఉదాహరణకు మాత్రమే. వివిధ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అఢ్డదారులు తొక్కుతున్నారు.

సెలబ్రెటీలు తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఎప్పుడూ జనాల్లో ఉండాలని చూస్తారు. అయితే హాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాకు ఒక దండం అంటూ పక్కనపెట్టేశారు.  

ముఖ్యంగా మైక్రో బ్లాగింగ్ సైట్లను బహిష్కరించేస్తున్నారు. ఏదైనా అప్ డేట్ ఉంటే మీడియాకే చెబుతామంటూ కొత్త రూల్ పాస్ చేసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న వారిలో మహామహులే ఉంటున్నారు. జార్జీ క్లూనీ, బ్రాడ్ ఫిట్, స్క్రార్లెట్ లాంటి వారు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. ఇక బాలీవుడ్ లో అమిక్ ఖాన్ కూడా సామాజిక మాద్యమం నుంచి వైదొలిగాడు. ఆ రూట్ లోనే దంగల్ ఫేమ్ ఫాతిమా సనా కూడా ఉంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా సోషల్ మీడియాతో కొత్తతలనొప్పులు కొని తెచ్చుకుంటోంది. ఇందులో ఎక్కువగా హీరోయిన్ లే బాగా ఇబ్బంది పడుతున్నారు. వారిపై పుట్టుకొస్తున్న గాసిప్స్ తో బయట తలెత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు.ఒక్కోసారి సహనం కోల్పోయి పుకార్లపై అసహనం వ్యక్తం  చేస్తున్నారు. ఒక్కొక్కరిగా సోషల్ మీడియా నుండి ఎగ్జిట్ అయిపోయే దిశగా అడుగులు వేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: