టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అందరికీ ఎంతో నచ్చుతాయి. కాసేపు సినిమాల సంగతి పక్కన పెడితే సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వం గురించి సినిమా వారే కాకుండా బయటివారు కూడా కథలు కథలుగా చెబుతూ ఉంటారు. సహాయం కోసం ఎవరు వచ్చిన ఉత్తి చేతులతో పంపించరట సూపర్ స్టార్ కృష్ణ. తన వారిని ఎంతో బాగా చూసుకునే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను సైతం ప్రేమ ఆరాధనలతో పలకరిస్తూ ఉంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయన తట్టుకోలేరట. తన నిర్మాతలను సురక్షితంగా కాపాడుకునే హీరోలలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు.

సినిమా కి నష్టం వస్తే పారితోషకాన్ని వెనక్కి చేయడంలో ఏమాత్రం సంకోచించరు సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ను నిర్మాతలు కూడా అభిమానిస్తూ ఆయనకు జేజేలు పలుకుతూ ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన నాయుడు గారి అబ్బాయి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. దర్శకుడు బీవీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఈ సినిమా లో రావు గోపాలరావు రంగనాథ్ విలన్ లు గా నటించారు. రాజీవీ ఫిలిమ్స్ బ్యానర్ పై రామలింగేశ్వరరావు గోపీనాథ్ కలిసి నిర్మించారు.

వాస్తవానికి వీరు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గతం లో సినిమా చేసిన నిర్మాతలు కారు. సూపర్ స్టార్ కృష్ణ నే వీరిని నిర్మాతలుగా మార్చారు. రామలింగేశ్వరరావు కి కృష్ణ అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానం మూలంగానే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఆ సమయంలో రామలింగేశ్వరరావు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం. ఈ సినిమా కు రచయిత గా దాసరి నారాయణరావు పని చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా హిందీ లో ఇంద్రజిత్ హీరో గా చేసిన కరవాన్ సినిమా ఆధారంగా రాజశ్రీ కథ రాశాడు. ఈ సినిమాకి అన్నీ చక్కగా కుదరడంతో టాప్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: