సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం కొత్తేంకాదు. హీరోల వారసులు, దర్శక నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో నటులుగా వివిధ రంగాలలో ప్రవేశిస్తూ తమ సత్తా చాటారు. ఆ విధంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి తండ్రి వారసత్వంతో వచ్చిన హీరో ఆకాష్ పూరి. బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించిన ఆకాష్ పూరి తాజాగా చిర్ బజార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నారు. గబ్బర్ సింగ్, బుజ్జిగాడు, చిరుత, ధోని , లోటస్ పాండ్ అనే సినిమాలలో బాలనటుడిగా నటించి నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.

అంతేకాకుండా మెహబూబా అనే సినిమాలో నటించి హీరోగా కూడా సెటిల్ అయ్యాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి రొమాంటిక్ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా, చోర్ బజార్ సినిమా మరొకటి.  ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయ్యింది. ఆకాష్ పూరి పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దళం , జార్జి రెడ్డి సినిమాలతో తనదైన డైరెక్షన్ తో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఐవి ప్రొడక్షన్ పతాకంపై బి ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా హీరోయిన్ గా గేహెనా సిప్పీ నటిస్తుంది. ఇక విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తుంటే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. టైటిల్ కి తగ్గట్లే ఫస్ట్ లుక్ లో సూపర్ మాస్ గా కనిపిస్తున్నాడు ఆకాశ్. బైక్ పక్కన నిల్చున్న ఆకాష్ చేతి మీద బచ్చన్ సాబ్ అనే టాటూ కూడా కనిపిస్తుంది. ఇది చూస్తుంటే తన తండ్రినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది ఆకాష్. హీరోల పాత్రను వెరైటీగా డిజైన్ చేసే పూరి జగన్నాథ్ తన కొడుకు కోసం అదే విధమైన పాత్ర ను ఎంచుకున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ పూరి సాధిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: