
బండ్ల గణేష్ హీరోగా వెంకట్ చంద్ర దర్శకత్వం లో తొలి పరిచయం చేస్తూ.. ఆయన హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారట. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్స్ నంబర్ వన్ గా స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చెబుతూ.."ఈ సినిమాకి హీరోగా బండ్ల గణేష్ అయితేనే సరిపోతుందని, ఆయనని సంప్రదించాలని తెలియజేశారు". దీనికి ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
తమిళంలో పార్థిబన్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ.."ఒత్తు సెరప్పు సైజ్ 7 " మూవీ ని బండ్ల గణేష్ రీమేక్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా పార్థిబన్ స్వీయ దర్శకత్వంలో వచ్చినది. ఇక ఈ సినిమాకు ఎన్నో అవార్డులు తో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమాని ఇదే సంవత్సరంలో సెప్టెంబరు మాసంలో ప్రారంభం చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. అంతేకాకుండా ఈ సినిమాకి అరుణ్ దేవినేని ఛాయాగ్రహాలుగా వ్యవహరిస్తున్నారు
ఇక అంతే కాకుండా ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా ను హిందీలో కూడా అభిషేక్ బచ్చన్ రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి చిత్రీకరణ కూడా చెన్నైలో ప్రారంభమైనట్లు ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాలు ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేస్తుంటే బండ్ల గణేష్ హీరో గా వస్తున్నాడు అనే ఆనందం కూడా అంతే స్థాయిలో కలుగుతోంది.