కోట్ల రూపాయలు పారితోషకం ఇచ్చే యాడ్స్ ల ను చేయడం ద్వారా సెలబ్రెటీలకు కోట్లలో డబ్బు వస్తాయి. సినిమాల్లో చేసే దానికంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు అందుకుంటారు. కమర్షియల్ యాడ్స్ ద్వారా కొంతమంది సెలబ్రిటీ లు కోట్లు గడిస్తుంటే ఇంకొంత మంది మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తాము యాడ్స్ లో నటించమని చెప్పి సదరు బ్రాండ్లకు షాకిచ్చారు. నిజానికి సదరు సెలబ్రిటీ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా కోట్లు ఇచ్చి తమ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసుకోవాలి అనుకునేది కంపెనీ వారి ఆలోచన.

కానీ కోట్లు ఇస్తానన్న కూడా వారు వద్దనడం ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆశ్చర్య పరుస్తోంది. దీని వెనుక కారణం ఏదైనా కూడా వారు యాడ్స్ ను రిజెక్ట్ చేయడం నిజంగా షాక్ అవ్వాల్సిందే విషయమే. అలా నందమూరి బాలకృష్ణ కు ఎన్నో యాడ్స్ తలుపు తట్టగా ఆయన ఒక్కటి కూడా చేయనని చెప్పడం గమనార్హం. ఆయన తో నటించిన హీరోయిన్లు సహనటులు చాలామంది యాడ్స్ లో నటించిన కోట్లు సంపాదిస్తున్న తను మాత్రం నో చెప్పాడు. అలాగే మలయాళంలో సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తెలుగునాట దూసుకుపోతున్న హీరోయిన్ సాయిపల్లవి కూడా యాడ్స్ లో నటించడానికి ఎక్కువ మక్కువ చూపలేదు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క కమర్షియల్ యాడ్ కూడా నటించలేదు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు కొన్ని యాడ్స్ చేయమని ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని సున్నితంగా రిజెక్ట్ చేశాడు. అలాగే హీరోయిన్ అనుష్క, గౌతమి, మంచు విష్ణు, మంచు మనోజ్, అల్లరి నరేష్ , సాయి ధరమ్ తేజ్ లు కూడా ఇంతవరకు ఒక్క యాడ్ లో కూడా చేయలేదు అంటే మీరు వీటికి ఎంత దూరం గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ఉన్నా యాడ్స్ కి దూరంగా ఉండటం వారి అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: