చాలామంది హీరోయిన్లు ఒక సినిమాలో నటించి ఆ చిత్రం విడుదలైన తర్వాత అందులో ఆ ముద్దుగుమ్మ చేసిన నటన ద్వారా లేదా సినిమా విజయవంతం కావడం ద్వారానో జనాల నుంచి క్రేజ్ను పొందుతారు. కానీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం దీనికి భిన్నం అని చెప్పవచ్చు. హాట్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ 'ఓరు కాదల్ లవ్' సినిమా నుంచి విడుదలైన ప్రోమో లో కన్నుకొట్టి యావత్ భారతదేశ కుర్రకారు మతి పోగొట్టింది. ఆ సినిమా ప్రోమో తెలుగులోనూ ఫుల్ సక్సెస్ కావడంతో ఆ సినిమానే 'లవర్స్ డే' పేరుతో తెలుగులో విడుదల చేశారు. కానీ 'లవర్స్ డే' సినిమా ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీ నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'చెక్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. కానీ ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ నటించిన 'ఇష్క్' నాట్ ఎ లవ్ స్టోరీ మూవీ లో కూడా కనిపించి తెలుగు ప్రజలను అలరించింది. ఇలా వరుస తెలుగు సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటుంది.

 తను రోజు చేసే పనులను మరియు ఇతర విషయాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పటికే కొన్ని సార్లు ఈ బ్యూటీ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారును వేడెక్కించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ పూల రైక ను ధరించి ,తన ఎద అందాలను ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్ , బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: