
ఈ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా.. ఒక బాడీగార్డ్ ఉన్నారట. అతడికి భారీగానే జీతం చెల్లిస్తున్నారట. అయితే గరిష్టంగా ఎంత ఉంటుంది? నెలకు ఎంత చెల్లిస్తారు.. ?ఏడాదికి ఎంత చెల్లిస్తారు అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్ జీతం సంవత్సరానికి 1.5 కోట్ల రూపాయలు ఉంటుందట. అంటే మాసానికి రూ.13 లక్షల రూపాయలు అన్నమాట.
అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకిన సమయంలో.. ఈ బాడీగార్డ్ జితేంద్ర దగ్గరుండి మరీ అమితాబ్ ఆరోగ్యాన్ని చూసుకున్నాడట. అతడే స్వయానా కరోనా సోకిన అమితాబ్ బచ్చన్ ను ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. అలా తన ప్రాణాలకు తెగించి మరీ అమితాబ్ బచ్చన్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు జితేందర్. అందుకోసమే అమితాబచ్చన్ అతనికి అంత జీతం ఇస్తున్నాడు.
ఇక అమితాబ్ బచ్చన్ ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటే తన సొంత బాడీగార్డ్ జితేంద్ర కూడా వెళ్తారట. ఇక అంతే కాకుండా విదేశాలకు వెళ్ళినా కూడా అమితాబ్ బచ్చన్ ఆరోగ్య సంక్షేమాలని జితేందర్ చూసుకుంటాడట. అంత కేరింగ్ ఉంటాడు కాబట్టే అమితాబచ్చన్ తనకి ఏడాదికి అంత జీతం ఇస్తున్నారు.