టాలీవుడ్ లో కొంతమంది బయోపిక్ ల విషయంలో కాస్తా ఈ మధ్యకాలంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బయోపిక్ లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనే దానిపై టాలీవుడ్ జనాలు ఆసక్తికరంగా చూస్తున్నారు. కొంతమంది ప్రముఖుల బయోపిక్ ల విషయంలో టాలీవుడ్ లో స్పష్టత రావడం లేదు. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ నీ తెరకెక్కించే అవకాశం ఉంది అనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తోంది. దీనిపై టాలీవుడ్ జనాలు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు అలాగే మంజుల ఇప్పటికే మాట్లాడారని కానీ కృష్ణ మాత్రం అందుకు అంగీకరించడం లేదని కొంతమంది కామెంట్ చేశారు.

అయితే ఇప్పుడు కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీంతో మహేష్ బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారని వచ్చే ఏడాది కృష్ణ పుట్టినరోజు నాటికి ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ గా ఏం తీసుకుంటారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా టైటిల్లో మాత్రం కృష్ణ సొంత గ్రామం బుర్రిపాలెం పేరుని ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి కథను ఒక ప్రముఖ రచయిత తో ఇస్తున్నారని కృష్ణ తో సన్నిహితంగా ఉండే వారితో ఈ కథకు రూపకల్పన చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు పూర్తిగా నిర్మాతగా మహేష్ బాబు వ్యవహరించవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న మాట. కృష్ణ పాత్రను ఎవరు పోషిస్తారు ఏంటనేది తెలియకపోయినా మహేష్ బాబు కుమారుడు గౌతం అలాగే హీరో నాని ఈ సినిమాలో కృష్ణ పాత్రను పోషించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఈ సినిమాకు విజయ నిర్మల కుమారుడు నరేష్ కూడా నిర్మాతగా వ్యవహరించ వచ్చు అని  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: