
ఈ రెండు చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ మూడవ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు ప్రేక్షకులు. మళ్లీ రవితేజతో బలుపు అనే చిత్రాన్ని తెరకెక్కించి వరుసగా హ్యాట్రిక్ హిట్ చిత్రాలను రూపొందించినట్లు అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన రామ్ తో పండగ చేస్కో, సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ సినిమా లను తెరకెక్కించగా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచాయి ఆ సినిమా లు. దాంతో నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మరి క్రాక్ లాంటి అద్భుతమైన కథను రెడీ చేసుకున్నాడు.
తనకు అచ్చొచ్చిన రవితేజ తో చేతులు కలిపి సూపర్ హిట్ గా నిలిచేల క్రాక్ సినిమా చేశాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేయనున్నాడు గోపీచంద్. అయితే గోపీచంద్ దర్శకత్వం వహించిన ఓ సినిమా ప్రభాస్ తో చేయాలని భావించగా చివరి నిమిషం లో అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. గోపీచంద్ తొలి సినిమా డాన్ శీను సినిమా నీ ప్రభాస్ తో చేయాలని చూడగా అప్పటికి ప్రభాస్ డేట్లు కుదరకపోవడంతో రవితేజకు చెప్పి ఒప్పించాడు. అంతేకాకుండా యాక్షన్ హీరో గోపీచంద్ కూడా ఈ కథను చెప్పాడు. వారికి కుదరక పోవడంతో ఆ హిట్ సినిమా రవితేజ ను వరించింది. మరి బాలకృష్ణతో ఈ దర్శకుడు చేయబోయే సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి