తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువగానే అనిపిస్తుంది. అయితే సావిత్రి అసలు పేరు నిస్సంకర సావిత్రి. ఆమె తన తన హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక హీరోయిన్ చెప్పడంలో అతిశయోక్తి లేదు. సావిత్రి సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా సూపర్ హిట్ కావాల్సిందే. సావిత్రి ఇండస్ట్రీకి మొదటిసారి 1950లో వచ్చిన సంసారం సినిమాలో కథానాయిక పాత్రలో నటించారు. ఆ తరువాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ పాతాళ భైరవి సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి ఘన విజయం అందుకుంది సావిత్రి.

అంతేకాక.. పెళ్లి చేసి చూడు, దేవదాసు, మిస్సమ్మ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. చిత్ర పరిశ్రమలో అగ్ర నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సరసన నటించి తన కంటూ ఒక మంచి ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు.. సావిత్రి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు. అయితే 1957లో మాయాబజార్ లో తన నటనకు ఆమె స్టార్ డం మరింత పెరిగిపోయిందనే చెప్పాలి మరి. ఆ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే సావిత్రి ఉదార మనసుకు ఎవరైనా సరే ఫిదా కానివారు ఉండరు.

సావిత్రి తెలుగులోనే కాకుండా తమిళం,కన్నడ ఇతర భాషలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గా సంపాదించిన డబ్బును కొంతమేరకు కార్మికులకు సహాయం అందిస్తుండేది. ఇక ఇలాంటి మంచి మనసున్న ఉన్న హీరోయిన్.. చివరి రోజుల్లో అత్యంత దారుణంగా మృతి చెందారు. సావిత్రి చివరి రోజుల్లో ఇలా అవ్వడానికి ముఖ్య కారణం తన ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుని పాటించకపోవడం అనే మాటలు ఆప్పుడు ఎక్కువగా వినపడ్డాయి. ఆమె అప్పట్లో తన ఇంట్లో నిర్మించుకున్న స్విమ్మింగ్ పూల్ వల్ల ఆ ఇంటికి వాస్తు పూర్తిగా తప్పిపోవడంతో.. ఈమె అలా అవ్వడానికి కారణం అని సావిత్రి తల్లి జమున చెప్పినట్లు సావిత్రి కూతురు స్రవంతి రావు ఓ ఇంటర్వ్యుల్లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: