
ఇక ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ తరుణంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఆయన తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిన విదితమే. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకొనునట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.
అయితే అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమీర్ కి పెద్ద కూతురిగా నటించిన ఫాతిమా ఆ సినిమా షూటింగ్ లోనే అమీర్ తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్ విషయానికి వస్తే.. ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా .. విడుదలకు రెడీగా ఉంది. ఈ మూవీ తరువాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజమున్నదో తెలియాలంటే ఈ జంట మౌనం వీడాల్సిందే మరి.