
ఎక్కడ బయటకు రానిచ్చేవారు కాదు. కానీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రిటీల కు ప్రేక్షకులకు మధ్య చాలా దగ్గరి సంబంధం ఏర్పడింది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది ప్రేమ పెళ్లి విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవలే ఓ హీరోయిన్ తన బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
బాలీవుడ్ మూవీ దంగల్ సినిమా లో అమీర్ ఖాన్ కుమార్తె గా నటించింది హీరోయిన్ సన్యా మల్హోత్ర. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. కానీ ఆ తర్వాత మాత్రం సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ కి వెళ్లిన ఈ అమ్మడు తన బ్రేకప్ విషయాన్ని బయట పెట్టి ఓపెన్ అయింది. ఢిల్లీలో ఒక వ్యక్తిని ప్రేమించాను అంటూ తెలిపింది. నాలుగేళ్లపాటు అతనితో రిలేషన్ లో ఉన్నానని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాము అంటూ చెప్పుకొచ్చింది. బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయానని.. బ్రేకప్ ఎంతో బాధను కలిగిస్తుంది అంటూ తెలిపింది. అయితే మనల్ని కాదనుకున్న వారి గురించి ఆలోచించడం వేస్ట్.. ప్రేమ అనేది సెల్ఫ్ లవ్ కంటే ఎక్కువ కాదు అన్న విషయాన్ని మాత్రం తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సన్యా మల్హోత్రా .