ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినాకైఫ్ సహనటుడు విక్కీ కౌశల్ ను డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విక్కీ కౌశల్ , కత్రినాకైఫ్ తమ పెళ్లికి సంబంధించి ఎన్నో విషయాలను చాలా జాగ్రత్తగా అమలుపరిచినట్లు సమాచారం. వీరికి సంబంధించిన ఫోటోలను కానీ పెళ్లి వీడియోలను కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు..అయితే వీరి ఫోటోలను , వీడియోలను ప్రముఖ సంస్థ అమెజాన్ ఏకంగా 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం.

ఇకపోతే తాజాగా వీరి పెళ్లికి హాజరైన వారి సన్నిహితులు వారి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులకు ఈ దంపతులు రిటర్న్ గిఫ్ట్ గా ఒక స్వీట్ బాక్స్ తో పాటు ఒక లెటర్ ను కూడా గిఫ్ట్ బాక్స్ లో పెట్టి మరీ ఇచ్చారు. వీరు తమ పెళ్లికి కేవలం కొంతమందిని మాత్రమే వివాహానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లికి హాజరు కాని సెలబ్రిటీలకు కూడా తాజాగా నేతితో తయారుచేసిన లడ్డూలను అలాగే ఒక లెటర్ ని కూడా గిఫ్ట్ ప్యాక్ చేసి మరి పంపించారు. కానీ వీరి పెళ్ళికి వచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఖరీదైన బహుమతులతో ఈ దంపతులను సర్ప్రైస్ చేశారు..

విక్కీ కౌశల్.. తన భార్య అయినటువంటి కత్రినా కైఫ్ కు ఏకంగా 1.3 కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ గిఫ్ట్ గా అందించాడు.

సల్మాన్ ఖాన్:వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మీద ఉన్న అభిమానంతో కత్రినా కైఫ్ కు  సల్మాన్ ఖాన్ ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.

రణబీర్ కపూర్:
కత్రినా కైఫ్ తో కొద్దికాలం పాటు డేటింగ్ చేసి విడిపోయిన వీరు ..మిత్రులుగా కొనసాగుతున్నారు. ఇక ఈయన కత్రినాకైఫ్ కు  రూ. 2.7 కోట్ల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం.

ఆలియా భట్:
ఆలియా భట్ .. కత్రినాకైఫ్ కు  అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్ బాస్కెట్ ను బహుమతిగా ఇచ్చారట.


షారుక్ ఖాన్:
రూ.1.5 లక్షల విలువ చేసే ఖరీదైన పెయింటింగ్ ఇచ్చారని సమాచారం.

హృతిక్ రోషన్:
బీఎండబ్ల్యూ జీ - 310 ఆర్ బైక్ ను బహుమతిగా ఇచ్చారట.

తాప్సీ:
తాప్సి.. విక్కీ కౌశల్ కు 1.4 లక్షల విలువచేసే ప్లాటినం బ్రాస్ లెట్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: