సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు బయటకు వస్తే వాళ్లని చూడడానికి అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎగబడుతుంటారు. అలా వాళ్ల నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు సినీ తారలు సొంతంగా బాడీగార్డ్స్ ని నియమించుకుంటూ ఉంటారు. ఇక ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సినిమా పరిశ్రమకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్.

అయితే పవన్ కళ్యాణ్ కి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు బాడీగార్డులు ఉన్నారు. సినిమా ఈవెంట్లకు, బహిరంగ సభలకు, అలాగే జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్లను అదుపు చేయడం కోసం పవన్ కళ్యాణ్ చుట్టూరానే ఆ ఐదుగురు బాడీగార్డులు ఉంటారు. ఇక సదరు బాడీగార్డ్ నెలవారి జీతం విషయానికొస్తే ఒక్కొక్క బాడీగార్డ్ కి 80 వేల రూపాయల నుండి లక్ష రూపాయల చొప్పున నెలవారి జీతంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బాడీగార్డ్స్ కి ఇంత మొత్తంలో నెల జీతం ఇస్తున్న సెలబ్రిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ బయటికి వచ్చారు అంటే కచ్చితంగా ఆ అయిదుగురు బాడీగార్డ్స్ ఉండాల్సిందే.

ఆయనతో ఎల్లప్పుడూ ఉండే ఆ బాడీగార్డ్స్ కి ఎలాంటి ఆపద వచ్చినా కూడా స్వయంగా చూసుకుంటారట పవన్. ఇక పవన్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాలవల్ల ఫిబ్రవరి 25న వాయిదా పడింది. ఇక మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాతో పాటుగా హరీష్ శంకర్ తో మరో సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: