
అమితాబ్ బచ్చన్ ఇంటి లో పనిచేసే సిబ్బంది లో ఒకరికి కరోనా పాజిటివ్ తేలినట్లు గా సమాచారం.. ఇక అందుచేతనే బిగ్ బి కూడా ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయనతో పనిచేస్తున్న 30 మంది సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తన నివాసంలో కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం కుదుటగానే ఉందట. కానీ ముందు జాగ్రత్త కోసం అమితాబ్ బచ్చన్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఇక ఆ సిబ్బందితో కలిసిన మిగతావారు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారట.ఇకపోతే 2020 వ సంవత్సరంలో కరోనా బారిన పడ్డారు అమితాబ్, అభిషేక్ బచ్చన్ లు.
అయితే ఆ సంవత్సరం తన కోడలు మనవరాళ్లు కూడా కరొనా బారిన పడ్డారు. తాజాగా ఇప్పుడు మరొకసారి నివాసం లో ఒకరికి కరోనా సోకడంతో ఆందోళన చెందుతున్నారు అభిమానులు. కేవలం మహారాష్ట్ర లో నిన్న ఒక్క రోజుకే..58,097 సరికొత్తగా కేసులు నమోదు అయ్యాయట.543 మంది మృత్యువాత పడ్డారట. ప్రస్తుతం దేశంలో నమోదయ్యే కేసులలో ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయట. దీంతో ప్రస్తుతం అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏది ఏమైనా అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.