పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.పవన్ నటిస్తున్న సినిమాల్లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా కూడా ఒకటి. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ ఇప్పుడు అదే ఊపులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక భవదీయ భగత్ సింగ్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో పవన్ కళ్యాణ్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరోవైపు హరీష్ శంకర్ - దేవి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పాటలు అయితే ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్,  మందు బాబులం సాంగ్,  కెవ్వు కేక పాటలైతే మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ సినిమా రూపొందుతోంది.

 ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు..' గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గారితో కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. అంచనాలకు తగ్గకుండా అవుట్ ఫుట్ ఉండాలంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మేము కష్టపడాలి. ఇక ఇప్పటికే నేను కొన్ని సాంగ్స్ చేశాను. చాలా ఎనర్జిటిక్ గా, మెలోడియస్ గా ఈ ఆల్బం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందనే ఉత్సాహంతో ఉన్నాడు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది' అని చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: