హీరో శర్వానంద్, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం శతమానం భవతి.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ వంటి నటులు కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కించి 2017వ సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అందుచేతనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుబడ్డాయి వాటి గురించి చూద్దాం.


డైరెక్టర్ సతీష్ వేగేశ్న కు ఈ సినిమా స్టోరీ 1990 వ సంవత్సరంలోనే పుట్టిందట.. ఈ సినిమా స్టోరీని ఆంధ్రప్రభ వార్త పత్రిక వారు పల్లె ప్రయాణం ఎటు అనే ఒక కాంపిటీషన్ పెట్టడం జరిగిందట. అందులో ఈ కథను రాసి పంపించారని డైరెక్టర్ తెలియజేశాడు. కానీ ఈ కథ అప్పుడు తిరస్కరించబడిందని తెలియజేశాడు. ఆ తర్వాత ఈ కథను మార్చి సినిమాగా తెరకెక్కించానని సతీష్ తెలియజేశాడు. ఇక 2015 వ సంవత్సరంలో హీరో సాయి ధరమ్ తేజ్.. దిల్ రాజ్ ప్రొడక్షన్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందులో ఒకటి సుప్రీం సినిమా కాగా మరొకటి శతమానం భవతి సినిమా అట.
కానీ శతమానం భవతి సినిమా షూటింగ్ కి డేట్స్ కుదరక పోవడంతో ఈ సినిమాలో రిజెక్ట్ చేశాడు. మరి ఆ తరువాత యువ హీరో రాజ్ తరుణ్ ని అనుకోగా.. చివరి నిమిషంలో హీరో శర్వానంద్ ని ఫిక్స్ చేశారు డైరెక్టర్. కానీ హీరోయిన్ గా మాత్రం అనుపమనే ఎంచుకున్నారు. ఈ సినిమాని 49 రోజులోనే  షూటింగును పూర్తి చేసినట్లుగా సమాచారం. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 8 కోట్లు కాక ఈ సినిమా కలెక్షన్లు 25 కోట్లకు పైగా కొల్లగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: