
నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ అదరగొడుతోంది. కాగా తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన లూప్ లపేట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.. అయితే థియేటర్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ఫామ్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాప్సీ పన్ను సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో ప్రధాన పాత్రలు చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో బెస్ట్ లేడీ ఓరియంటెడ్ కథలు నా దగ్గరికి వస్తాయి అన్న విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలను. ఎందుకంటే ఎంతోమంది రచయితలు నా దగ్గరికి వచ్చి ఈ మీకోసమే రాసాము అంటూ చెబుతూ ఉంటే ఎంతో ఆనందపడుతూ ఉంటాను. కానీ మంచి పాత్రలు రావాలి అంటే అదృష్టం ఉండాల్సిందే.. ఆ అదృష్టం నాకు ఉంది అని అనుకుంటున్నా తాప్సీ చెప్పుకొచ్చింది.